జాతర రద్దీలో పోయిన సెల్‌ఫోన్‌.. తిరిగి అప్పగించిన పోలీసులు

రేణిగుంట, సెప్టెంబర్ 9 (రాజనీతి): కరకంబాడి పంచాయతీ పరిధిలోని శ్రీశ్రీశ్రీ కట్ట పుట్టాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భక్తుల రద్దీ మధ్య ఓ మహిళ తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకుంది. ఫోన్‌ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె అక్కడే విధులు నిర్వహిస్తున్న రేణిగుంట అర్బన్‌ ఎస్‌ఐ శ్రీనివాసులను ఆశ్రయించి విషయాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ శ్రీనివాసులు సిబ్బంది సహకారంతో సెల్‌ఫోన్‌ ఆచూకీ కోసం చర్యలు చేపట్టి, దానిని గుర్తించి సదరు మహిళకు సురక్షితంగా తిరిగి అప్పగించారు. పోయిందనుకున్న ఫోన్‌ను పోలీసులు చొరవ తీసుకుని తిరిగి అందించడంతో మహిళ ఆనందం వ్యక్తం చేసి ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల...