Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వైభవంగా ప్రారంభమైన కరకంబాడి కట్ట పుట్టాలమ్మ జాతర

    Author RAJANEETHI | 08 Sep 2026, 03:00 PM | ANDHRA PRADESH
    వైభవంగా ప్రారంభమైన కరకంబాడి కట్ట పుట్టాలమ్మ జాతర

    రేణిగుంట సెప్టెంబర్ 8 (రాజనీతి): రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలో కొలువైన శ్రీశ్రీశ్రీ కట్ట పుట్టాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సుమారు 400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన అమ్మవారిని కోరిన కోర్కెలు తీర్చే శక్తిస్వరూపిణిగా భక్తులు విశ్వసిస్తారు. బ్రిటిష్‌ కాలం నుంచే అమ్మవారికి విశేష మహిమ ఉందని స్థానికుల నమ్మకం. జాతర సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, అర్చనలు నిర్వహించారు. తిరుపతి, రేణిగుంటతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.