Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అలరించిన చిన్నారుల శ్రీకృష్ణ వేషధారణ

    Author RAJANEETHI | 04 Sep 2026, 07:12 PM | ANDHRA PRADESH
    అలరించిన చిన్నారుల శ్రీకృష్ణ వేషధారణ

    పుంగనూరు, సెప్టెంబర్‌ 4 (రాజనీతి): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఆలయాలకు చేరుకుని సందడి చేశారు. చిన్నారుల బుడిబుడి నడకలు, శ్రీకృష్ణుడి వేషంలో చేసిన చేష్టలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలను అందంగా అలంకరించి వేషధారణలో సిద్ధం చేశారు. ఆలయాలకు వచ్చిన భక్తులు చిన్నారులను చూసి ముచ్చటపడి, శ్రీకృష్ణుడు, గోపికలను దర్శించిన అనుభూతికి లోనయ్యారు. ఈ సందర్భంగా చిన్నారుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.