Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పండుగ వాతావరణంలో పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ

    Author RAJANEETHI | 03 Sep 2026, 05:32 PM | ANDHRA PRADESH
    పండుగ వాతావరణంలో పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ

    రేణిగుంట, సెప్టెంబర్‌ 3 (రాజనీతి): రేణిగుంట మండలం ఎస్‌.యూ.పురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే ప్రాజెక్టు కింద పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమం తహసీల్దార్‌ శ్రవణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పాల్గొని రైతులకు రాజముద్రతో కూడిన 185 పాస్‌బుక్‌లను అందజేశారు. రీ-సర్వే అనంతరం పాత పాస్‌బుక్‌ల స్థానంలో కొత్త పాస్‌బుక్‌లు జారీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ‘నా భూమి–నా హక్కు’ లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవిచంద్ర, ఆర్‌ఐ దిలీప్‌, ఎస్‌ఐ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎస్ యు పురం టిడిపి నాయకులు సుధాకర్, క్రాంతి కుమార్, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.