Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రతి విగ్రహానికి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.. డీఎస్పీ శ్రీనివాసరావు

    Author RAJANEETHI | 03 Sep 2026, 03:29 PM | ANDHRA PRADESH
    ప్రతి విగ్రహానికి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.. డీఎస్పీ శ్రీనివాసరావు

    రేణిగుంట, సెప్టెంబర్‌ 3 (రాజనీతి): వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ఉత్సవ నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తిగా సహకరించాలని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు కోరారు. వినాయక విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణ, భద్రతా చర్యలు, నిమజ్జనం సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర అంశాలపై గురువారం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఉత్సవ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఐ జయచంద్ర, ఎస్సై శ్రీనివాసులు పాల్గొని నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు ప్రతి దశలోనూ పోలీసు శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఏడాది రేణిగుంట పరిధిలో సుమారు 100 నుంచి 140 వరకు వినాయక విగ్రహాలకు రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేసి ఉండే అవకాశం కూడా ఉందన్నారు. వినాయక విగ్రహాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటి భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర అంశాలపై పోలీసు శాఖ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. అందువల్ల వినాయక విగ్రహం ఏర్పాటు చేసే ప్రతి నిర్వాహకుడు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ ద్వారా ఆయా విగ్రహాల ఏర్పాటు ప్రాంతాలు, నిర్వాహకుల వివరాలు పోలీసుల వద్ద అందుబాటులో ఉంటాయని, తద్వారా భద్రతా ఏర్పాట్లు చేసుకోవడానికి పోలీసు శాఖకు సులభతరం అవుతుందని వివరించారు. వినాయక విగ్రహాల భద్రత విషయంలో నిర్వాహకులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి మండపం వద్ద నిర్వాహకుల్లో కనీసం ఒకరు రాత్రి సమయంలో విగ్రహం వద్ద ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
    విగ్రహాల వద్ద భద్రతా లోపాలకు అవకాశం లేకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.