Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించుకుని.. ఇప్పుడు ఖాళీ చేయమనడం దారుణం

    Author RAJANEETHI | 29 Aug 2026, 10:42 PM | ANDHRA PRADESH
    పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించుకుని.. ఇప్పుడు ఖాళీ చేయమనడం దారుణం

    తిరుపతి, ఆగస్టు 29 (రాజనీతి): రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ శ్రీనివాసపురంలో దశాబ్దాలుగా నివసిస్తున్న 20 నిరుపేద కుటుంబాలను ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి చేయడం దారుణమని ఆర్‌ఎస్‌పీ జిల్లా కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. ప్రభుత్వం 1984లో పట్టాలు మంజూరు చేయడంతో పేదలు అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకుని, విద్యుత్‌ బిల్లులు, ఇంటి పన్నులు చెల్లిస్తూ నివసిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఖాళీ చేయించడం అన్యాయమని పేర్కొంటూ డీఆర్వో నరసింహులుకు వినతిపత్రం అందజేశారు. సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తామని డీఆర్వో హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే, కలెక్టర్‌ జోక్యం చేసుకుని పేదలకు న్యాయం చేయాలని బాలకృష్ణ కోరారు.