Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సదరం సర్టిఫికెట్‌ ఇక వాట్సప్‌లోనే!

    సదరం సర్టిఫికెట్‌ ఇక వాట్సప్‌లోనే!

    అమరావతి: దివ్యాంగులు, అంగవైకల్యం ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై సదరం సర్టిఫికెట్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సప్‌ ద్వారానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. సదరం సర్టిఫికెట్‌ ఆధారంగా పింఛన్లు సహా వివిధ ప్రభుత్వ ప్రయోజనాలు పొందే వారికి ఈ సేవ ఉపయోగపడనుంది.

    వాట్సప్‌లోనే అన్ని సేవలు సచివాలయాల
    చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. ఇంటి నుంచే స్లాట్‌ బుకింగ్
    మెడికల్‌ పరీక్షల తర్వాత సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం

    ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వాట్సప్‌ గవర్నెన్స్‌లోకి సదరం సేవలను కూడా తీసుకొచ్చింది. సదరం సర్టిఫికెట్‌కు సంబంధించిన స్లాట్‌ అందుబాటు తెలుసుకోవడం, స్లాట్‌ బుక్‌ చేసుకోవడం, మెడికల్‌ పరీక్షల అనంతరం సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం వంటి సేవలను వాట్సప్‌ ద్వారానే పొందవచ్చు. ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

    ఇలా చేసుకోవాలి..

    ఇవి కూడా చదవండి

    1. వాట్సప్‌లో 9552900009 నంబర్‌కు Hi అని మెసేజ్‌ చేయాలి.
    2. అనంతరం Citizen Services ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
    3. అందులో SADAREM Serviceను ఎంపిక చేయాలి.
    4. స్లాట్‌ అందుబాటు, స్లాట్‌ బుకింగ్‌, సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ వంటి ఆప్షన్లలో అవసరమైనదాన్ని ఎంచుకోవాలి.
    5. స్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత నిర్దేశిత వైద్య పరీక్షలు పూర్తిచేయాలి.
    6. అనంతరం అప్లికేషన్‌ నంబర్‌ ఆధారంగా సదరం సర్టిఫికెట్‌ను వాట్సప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

    పింఛన్లకు కీలకం

    అంగవైకల్యాన్ని ధ్రువీకరించేందుకు సదరం సర్టిఫికెట్‌ కీలకమైన పత్రం. కొత్త పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు ఇది అవసరం. దీంతోపాటు ప్రభుత్వం కల్పించే కొన్ని ఇతర సదుపాయాలను పొందేందుకు కూడా ఈ ధ్రువీకరణ పత్రం ఉపయోగపడుతుంది.

    ఇక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు వద్దు..
    వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా సదరం సేవలు అందుబాటులోకి రావడంతో దివ్యాంగులు ఇంటి నుంచే ప్రక్రియను ప్రారంభించుకునే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా సచివాలయాలకు వెళ్లడం కష్టంగా ఉన్న వారికి ఈ డిజిటల్‌ సేవ మరింత ఉపయోగకరంగా మారనుంది.