Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అందుబాటులోకి రేణిగుంట సంత రైల్వే గేటు

    Author RAJANEETHI | 28 Aug 2026, 10:35 AM | ANDHRA PRADESH
    అందుబాటులోకి రేణిగుంట సంత రైల్వే గేటు

    రేణిగుంట, ఆగస్టు 28 (రాజనీతి): రేణిగుంట సంత ప్రాంగణంలోని రైల్వే గేటు నాలుగు రోజుల అనంతరం శుక్రవారం వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. రైల్వే గేటు వద్ద మరమ్మతులు, ఇతర నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 24వ తేదీ సోమవారం నుంచి గేటును తాత్కాలికంగా మూసివేశారు. పనులు పూర్తికావడంతో శుక్రవారం గేటును తిరిగి తెరిచి వాహనాల రాకపోకలకు అనుమతించారు. గేటు మూసివేత కారణంగా గత నాలుగు రోజులుగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రస్తుతం మరమ్మతు పనులు పూర్తవడంతో రేణిగుంట సంత ప్రాంగణం మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు తొలగాయి. గేటు తిరిగి అందుబాటులోకి రావడంతో స్థానికులు, వ్యాపారులు, వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.