Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పార్టీ కోసం కృషి.. ప్రజల కోసం సేవ.. మౌనిక ప్రత్యేకత!

    పార్టీ కోసం కృషి.. ప్రజల కోసం సేవ.. మౌనిక ప్రత్యేకత!

    కందుకూరు (జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ప్రజలకు ఏ సమస్య వచ్చినా “నేను ఉన్నాను” అంటూ ముందుకు వచ్చి తనవంతు సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన పువ్వాడి మౌనిక. సేవనే లక్ష్యంగా, ప్రజలతో మమేకమై పనిచేయాలనే ఆశయంతో ఆమె ముందుకు సాగుతున్నారు.తెలుగుదేశం పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న మౌనిక.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ టీడీపీ తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయ సేవతో పాటు సామాజిక సేవకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.స్కంధపురి సేవా సమితి చైర్మన్‌గా కొనసాగుతున్న ఆమె.. ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తనవంతు ఆర్థిక సహాయం అందించడం, అవసరమైన వారికి అండగా నిలవడం, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు.ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి వస్తే స్పందించి సహాయం చేయాలనే ఆలోచనతో మౌనిక ముందుకు సాగుతున్నారని ఆమెను అభినందిస్తున్నవారు చెబుతున్నారు. ముఖ్యంగా ఆమె నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో తనవంతు పాత్ర పోషిస్తున్న మౌనికకు రానున్న రోజుల్లో .సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్న ఆమెకు టీడీపీలో మంచి పదవి రావాలని స్థానికులు, పార్టీ అభిమానులు ఆశిస్తున్నారు.