Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోలీసుల పటిష్ట భద్రత మధ్య ప్రశాంతంగా గంగమ్మ జాతర

    Author RAJANEETHI | 18 Aug 2026, 05:37 PM | ANDHRA PRADESH
    పోలీసుల పటిష్ట భద్రత మధ్య ప్రశాంతంగా గంగమ్మ జాతర

    రేణిగుంట, ఆగస్టు 18 (రాజనీతి): రేణిగుంట శ్రీ గంగమ్మ తల్లి జాతర పోలీసుల పటిష్ట భద్రత, కట్టుదిట్టమైన నిఘా మధ్య ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో రేణిగుంట అర్బన్‌ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలతో పాటు ప్రధాన రహదారులు, జాతర ప్రాంగణం, రద్దీ ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల మళ్లింపు, పార్కింగ్‌ తదితర చర్యలు చేపట్టారు. ఆకతాయిలు, దొంగతనాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ జయచంద్ర కోరారు. పోలీసుల సమర్థవంతమైన భద్రతా చర్యలతో జాతర ప్రశాంతంగా కొనసాగుతుండటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.