Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గంగమ్మ జాతరలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ప్రజలు సహకరించాలి

    Author RAJANEETHI | 18 Aug 2026, 04:58 PM | ANDHRA PRADESH
    గంగమ్మ జాతరలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ప్రజలు సహకరించాలి

    రేణిగుంట, ఆగస్టు 18 (రాజనీతి): గంగమ్మ జాతర సందర్భంగా ఈ నెల 18, 19 తేదీల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు, ట్రాఫిక్‌ మళ్లింపులు చేపడుతున్నట్లు రేణిగుంట సీఐ జయచంద్ర తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగిస్తూ ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. మీడియా, ప్రజాప్రతినిధులు, సోషల్‌ మీడియా గ్రూపుల నిర్వాహకులు ట్రాఫిక్‌ మళ్లింపుల సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతర ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.