Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భక్తి పారవశ్యంలో గంగమ్మ తల్లి జాతర

    Author RAJANEETHI | 17 Aug 2026, 09:34 PM | ANDHRA PRADESH
    భక్తి పారవశ్యంలో గంగమ్మ తల్లి జాతర

    రేణిగుంట, ఆగస్టు 17 (రాజనీతి): రేణిగుంట శ్రీ గంగమ్మ తల్లి జాతర తొలిరోజు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారి శక్తిరూపంగా భావించే గరిగెలకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, పసుపు, కుంకుమ, వేపాకులు, పూలతో అలంకరించారు. అనంతరం మంగళవాయిద్యాలు, డప్పుల మోత, జానపద కళల నడుమ భక్తులు గరిగెలను తలపై మోసుకుంటూ పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి హారతులు సమర్పించారు. గంగమ్మ నామస్మరణతో పురవీధులు మార్మోగగా, ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. జాతర మూడు రోజుల పాటు కొనసాగనుంది.