Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యం

    హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యం

    పుంగనూరు,రాజనీతి, ఆగస్టు 12:
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా కలెక్టర్ ఆదేశాలు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ విభాగం సూచనల మేరకు పుంగనూరు ఏరియా ఆస్పత్రిలో బుధవారం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు రెండు నెలల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, రిస్క్‌ ప్రాంతాల్లో ప్రజలకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి, నివారణ, అపోహల తొలగింపు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.పుంగనూరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. హరగోపాల్ ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఎంఓ హిమశైలజ, వైద్యులు డా. మధుసూదనాచారి, డా. మాధవరెడ్డి, డా. కల్పన, ఎల్‌టీ రెహమాన్, కౌన్సిలర్ (జనరల్) ప్రకాశ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.అలాగే జనచేతన ఎన్‌జీవోకు చెందిన ఓఆర్‌డబ్ల్యూ శ్రావణి, ఎల్‌డబ్ల్యూ గణేష్ తదితరులు పాల్గొని హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. ప్రజలు అపోహలకు గురికాకుండా వ్యాధి నివారణ చర్యలపై అవగాహన పెంపొందించుకోవాలని కార్యక్రమంలో సూచించారు.

    అత్యధికంగా చదివినవి