హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యం

పుంగనూరు,రాజనీతి, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా కలెక్టర్ ఆదేశాలు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ విభాగం సూచనల మేరకు పుంగనూరు ఏరియా ఆస్పత్రిలో బుధవారం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు రెండు నెలల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, రిస్క్‌ ప్రాంతాల్లో ప్రజలకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి, నివారణ, అపోహల తొలగింపు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.పుంగనూరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. హరగోపాల్ ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఎంఓ హిమశైలజ, వైద్యులు...