Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భూ రీ-సర్వేపై గ్రామసభ

    Author GNANAPRAKASH | 12 Aug 2026, 07:50 PM | ANDHRA PRADESH, చిత్తూరు
    భూ రీ-సర్వేపై గ్రామసభ

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు భూముల సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న సమగ్ర భూ రీ-సర్వేకు రైతులు సహకరించాలని మండల డిప్యూటీ తహసీల్దార్‌ రూపాదేవి కోరారు. రామభద్రపురం గ్రామ పంచాయతీ సచివాలయంలో బుధవారం మండల రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన భూ రీ-సర్వేపై గ్రామసభ నిర్వహించారు. ఆమె నేతృత్వంలో జరిగిన సమావేశంలో గుడిపాల ఎంపీపీ గోళ్ల హరిప్రసాద్‌ చౌదరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రూపాదేవి మాట్లాడుతూ.. రీ-సర్వే ద్వారా ప్రతి భూమికి డిజిటల్‌ మ్యాప్‌తో కూడిన విశిష్ట గుర్తింపు కార్డును అందించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా, భూముల హద్దులు స్పష్టంగా ఉండేలా ఈ ప్రక్రియ దోహదపడుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రీ-సర్వే సమయంలో అధికారులకు అవసరమైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.కార్యక్రమంలో మండల సర్వేయర్‌ రామకృష్ణ, స్థానిక వీఆర్వో రవి, సచివాలయ అధికారులు సురేష్‌, జయశ్రీ, భవ్య, రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి