Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేరాల నివారణలో అంగన్‌వాడీ సిబ్బంది సహకారం కీలకం

    Author RAJANEETHI | 12 Aug 2026, 04:20 PM | ANDHRA PRADESH
    నేరాల నివారణలో అంగన్‌వాడీ సిబ్బంది సహకారం కీలకం

    రేణిగుంట, ఆగస్టు 12 (రాజనీతి): రేణిగుంట పట్టణంలోని బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమంలో రేణిగుంట అర్బన్ ఎస్‌ఐ శ్రీనివాసులు అంగన్‌వాడీ సిబ్బందికి అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రజలతో నిరంతరం మమేకమయ్యే అంగన్‌వాడీ సిబ్బందికి కుటుంబాలు, వారి పరిస్థితులు, సమస్యలపై మంచి అవగాహన ఉంటుందని తెలిపారు. నేరాల నివారణలో వారి సహకారం పోలీసులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో పోలీసుల లాక్‌డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

    అత్యధికంగా చదివినవి