Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన లారీ.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెనుప్రమాదం

    రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన లారీ.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెనుప్రమాదం

    పుంగనూరు, రాజనీతి,ఆగస్టు 12: రాంగ్‌రూట్‌లో వేగంగా దూసుకొచ్చిన లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టబోయిన ఘటన పుంగనూరు పట్టణ పరిధిలో కలకలం రేపింది. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది.
    ఆర్టీసీ బస్సు తన మార్గంలో వెళ్తుండగా ఎదురుగా రాంగ్‌రూట్‌లో ఓ లారీ వేగంగా దూసుకొచ్చింది. బస్సుకు అత్యంత సమీపంగా లారీ రావడంతో క్షణాల్లో ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడింది. లారీని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును చాకచక్యంగా పక్కకు మళ్లించాడు. దీంతో లారీని ఢీకొనకుండా బస్సు తప్పించుకోగలిగింది.
    ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు.
    రాంగ్‌రూట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.రాంగ్‌రూట్‌లో వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారుల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.