రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన లారీ.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెనుప్రమాదం

పుంగనూరు, రాజనీతి,ఆగస్టు 12: రాంగ్‌రూట్‌లో వేగంగా దూసుకొచ్చిన లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టబోయిన ఘటన పుంగనూరు పట్టణ పరిధిలో కలకలం రేపింది. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు తన మార్గంలో వెళ్తుండగా ఎదురుగా రాంగ్‌రూట్‌లో ఓ లారీ వేగంగా దూసుకొచ్చింది. బస్సుకు అత్యంత సమీపంగా లారీ రావడంతో క్షణాల్లో ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడింది. లారీని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును చాకచక్యంగా పక్కకు మళ్లించాడు. దీంతో లారీని ఢీకొనకుండా బస్సు తప్పించుకోగలిగింది. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా...