Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విధి నిర్వహణలో వెంకటేశ్వరరావు ప్రత్యేక బాట.....

    విధి నిర్వహణలో వెంకటేశ్వరరావు ప్రత్యేక బాట.....

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ప్రభుత్వ విధుల్లో క్రమశిక్షణ, బాధ్యత ఎంత ముఖ్యమో.. పరస్పర అవగాహన, స్నేహపూర్వక వాతావరణం కూడా అంతే అవసరం. విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది మధ్య సానుకూల సంబంధాలు ఉంటేనే ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సమర్థంగా చేరుతాయి. ఈ దిశగా చిత్తూరు జిల్లా డీఈవో కార్యాలయం పరిధిలో ఏడి-2 వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్న తీరు ప్రత్యేకంగా నిలుస్తోంది.ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంతోపాటు తోటి సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా కార్యాలయ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమస్యలను ఆదేశాలతో మాత్రమే పరిష్కరించకుండా.. పరస్పర చర్చలు, అవగాహన, సమన్వయంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.ఈ క్రమంలో వెంకటేశ్వరరావు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ.. సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూనే.. సిబ్బంది ఎదుర్కొనే సమస్యలను తెలుసుకుని వాటిపై అవగాహన కల్పించడం, అవసరమైన సూచనలు చేయడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

    విధే ప్రథమం.. సేవే లక్ష్యం....

    ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో విధుల్లోకి వస్తారు. అయితే పని ఒత్తిడి, పరిపాలనా బాధ్యతలు, వివిధ అంశాలపై సమన్వయం వంటి కారణాలతో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో పరస్పర సహకారం, స్నేహపూర్వక అవగాహన ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.విధి నిర్వహణలో పారదర్శకత, సమయపాలన, బాధ్యతతో పాటు మానవీయ దృక్పథం ఉంటే ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందని చెబుతున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా వ్యవహరించడం, వారి సమస్యలను ఓపికగా వినడం, సంబంధిత అంశాలపై సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని పేర్కొంటున్నారు.

    ఇవి కూడా చదవండి

    సమన్వయంతోనే సత్ఫలితాలు...

    విద్యాశాఖకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాల్లో అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య సమన్వయం ఎంతో కీలకం. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశాల్లో చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా తావులేకుండా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో విధి నిర్వహణతో పాటు స్నేహపూర్వక అవగాహనకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వం అందించే సేవలు చివరి లబ్ధిదారుడి వరకు చేరాలంటే.. కార్యాలయంలో సమన్వయం, సిబ్బందిలో అవగాహన, అధికారుల్లో బాధ్యతాభావం అవసరం. ఈ మూడు అంశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే ప్రభుత్వ లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరుతాయి.