విధి నిర్వహణలో వెంకటేశ్వరరావు ప్రత్యేక బాట.....

చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ప్రభుత్వ విధుల్లో క్రమశిక్షణ, బాధ్యత ఎంత ముఖ్యమో.. పరస్పర అవగాహన, స్నేహపూర్వక వాతావరణం కూడా అంతే అవసరం. విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది మధ్య సానుకూల సంబంధాలు ఉంటేనే ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సమర్థంగా చేరుతాయి. ఈ దిశగా చిత్తూరు జిల్లా డీఈవో కార్యాలయం పరిధిలో ఏడి-2 వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్న తీరు ప్రత్యేకంగా నిలుస్తోంది.ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంతోపాటు తోటి సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా కార్యాలయ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమస్యలను ఆదేశాలతో మాత్రమే పరిష్కరించకుండా.. పరస్పర చర్చలు, అవగాహన, సమన్వయంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు...