Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ముక్కోటి ఆలయానికి ఎకరా స్థలం కేటాయింపు

    Author RAJANEETHI | 11 Aug 2026, 03:20 PM | ANDHRA PRADESH
    ముక్కోటి ఆలయానికి ఎకరా స్థలం కేటాయింపు

    చంద్రగిరి, ఆగస్టు 11 (రాజనీతి): తొండవాడ సమీపంలోని స్వర్ణముఖి నది తీరంలో వెలసిన శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ఎకరా స్థలాన్ని కేటాయిస్తూ జిల్లా కలెక్టర్‌ డా.ఎస్‌.వెంకటేశ్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆలయ ట్రస్టీ మొగిలి సుందరరామిరెడ్డి హార్టికల్చర్‌, సెరికల్చర్‌ భవనాల కోసం స్థలాన్ని కేటాయించగా, ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన భవనంతో సహా స్థలాన్ని ఆలయానికి తిరిగి కేటాయించారు. మంగళవారం కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని నవీన్‌కుమార్‌రెడ్డి అందుకున్నారు. త్వరలో ఈ స్థలంలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

    ముక్కోటి ఆలయానికి ఎకరా స్థలం కేటాయింపు - Additional Image
    అత్యధికంగా చదివినవి