Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శివయ్య ఏకగ్రీవం

    Author RAJANEETHI | 08 Aug 2026, 07:52 PM | ANDHRA PRADESH
    ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శివయ్య ఏకగ్రీవం

    చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం చిత్తూరులో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా వి. శివయ్య, కార్యదర్శిగా నరేష్‌బాబు ఎన్నికయ్యారు. 21 పోస్టులకు ఒక్కొక్క నామినేషన్‌ రావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉద్యోగుల పీఆర్‌సీ, డీఏ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని శివయ్య తెలిపారు.

    ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శివయ్య ఏకగ్రీవం - Additional Image