Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మాదకద్రవ్యాల పై పోలీసుల ఉక్కుపాదం

    Author RAJANEETHI | 08 Aug 2026, 04:11 PM | ANDHRA PRADESH
    మాదకద్రవ్యాల పై పోలీసుల ఉక్కుపాదం

    గంజాయి, మాదకద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేసి యువతను మత్తు మహమ్మారి నుంచి దూరంగా ఉంచేందుకు గాజులమండ్యం పోలీసులు ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డిఎస్పి శ్రీనివాసరావు సూచనలతో రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ హరీష, పోలీస్ సిబ్బంది గాజులమండ్యం పారిశ్రామికవాడలోని పిఓసిఎల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు బయోకిట్‌ల ద్వారా గంజాయి వినియోగ పరీక్షలు నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన పరీక్షల్లో సుమారు 90 మంది కార్మికులకు బయోకిట్‌ల ద్వారా యూరిన్‌ పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు సీఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు. పారిశ్రామికవాడలో పనిచేస్తున్న కార్మికుల్లో ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారిలో మత్తు పదార్థాల వినియోగం ఉందేమోనన్న అనుమానంతో ఈ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంతకుముందు కూడా పలు పారిశ్రామిక ప్రాంతాల్లో ఇదే తరహా బయో చెక్‌లు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ఎర్రమరెడ్డిపాలెం, వినాయకపురం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే సుమారు 600 మందికి పైగా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఇకపై కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.