Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిర్ణీత సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం...ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ..

    నిర్ణీత సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం...ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ..

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ప్రజల నుంచి అందే వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజాదర్బార్ లో శుక్రవారం ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల అందించిన వినతులను, ఫిర్యాదులను పరిశీలించి.. వారితో మాట్లాడారు...సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను వేగాంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మొత్తం 43 వినతులు అందాయి.

    ఇంటి స్థలాల పంపిణీకి చర్యలు...

    ఇల్లు లేని పేదల కోసం ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా నగరపాలక పరిధిలోని అనుప్పల్లి వద్ద ఇంటి స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఇస్తున్న ఒక సెంటు స్థలం బదులుగా రెండు సెంట్ల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈనెల 24న అనుప్పల్లి వద్ద ఇంటి స్థలాలు పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వివరించారు. అనుప్పల్లి లేఅవుట్ లో వీధి దీపాల ఏర్పాటుకు కలెక్టర్ 5 లక్షలు మంజూరు చేశారని, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.కార్యక్రమంలో ఎంహెచ్వో డా. అనిల్ కుమార్, డీటీలు ఇబ్రహీం, విజయ కృష్ణ, డీఈ రమణ, కూటమి నాయకులు సురేంద్ర కుమార్, అముద, నరేష్, రఘు, హేమాద్రి నాయుడు, గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి