నిర్ణీత సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం...ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ..
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ప్రజల నుంచి అందే వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజాదర్బార్ లో శుక్రవారం ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల అందించిన వినతులను, ఫిర్యాదులను పరిశీలించి.. వారితో మాట్లాడారు...సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను వేగాంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మొత్తం 43 వినతులు అందాయి. ఇంటి స్థలాల పంపిణీకి చర్యలు... ఇల్లు లేని పేదల కోసం...