Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చుండూరు అమరవీరులకు ఘన నివాళి

    Author RAJANEETHI | 06 Aug 2026, 08:30 PM | ANDHRA PRADESH
    చుండూరు అమరవీరులకు ఘన నివాళి

    చుండూరు దళిత నరమేధానికి 35 ఏళ్లు పూర్తైన సందర్భంగా పీలేరులో మాలమహానాడు ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ చుండూరు ఘటనకు పూర్తి న్యాయం ఇంకా జరగలేదని, నేటికీ మాల, మాదిగలపై దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, సుప్రీంకోర్టులో ఉన్న చుండూరు కేసును వేగంగా విచారించి దోషులకు శిక్షలు విధించాలని, దళితుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణకు అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.