Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చిన్ననాటి కలను నిజం చేస్తున్న నాయకుడు... చిత్తూరు అభివృద్ధే ధ్యేయమన్న గురజాల జగన్ మోహన్....

    Author GNANAPRAKASH | 06 Aug 2026, 04:37 PM | ANDHRA PRADESH, Politics, చిత్తూరు
    చిన్ననాటి కలను నిజం చేస్తున్న నాయకుడు... చిత్తూరు అభివృద్ధే ధ్యేయమన్న గురజాల జగన్ మోహన్....

    సేవే లక్ష్యం... పోరాటమే మార్గం: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం...

    ప్రజా సేవలో రాజీ లేదు... చిత్తూరు కోసం చివరి వరకు పోరాడతానన్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్....

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):నేను సామాన్యంగా యుద్ధం తప్పించే దానికే ప్రయత్నిస్తాను. కానీ పరిస్థితులు అనివార్యమైతే గెలిచే వరకు వెనక్కి తగ్గను" అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే తనకు ఒకే ఒక్క లక్ష్యమని, తన సొంత చిత్తూరు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. ప్రజల ఆశీస్సులు, నమ్మకమే తనకు అతిపెద్ద బలమని పేర్కొన్న ఎమ్మెల్యే, నియోజకవర్గ అభివృద్ధే తన జీవిత ధ్యేయమని స్పష్టం చేశారు. రాజకీయాలను పదవుల కోసం కాకుండా ప్రజలకు న్యాయం చేయడానికి, అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి చేరవేయడానికి ఒక అవకాశంగా భావిస్తున్నానని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనుకడుగు వేయబోనని, చిత్తూరు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆ నాయకత్వం స్ఫూర్తితో చిత్తూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగంతో సమన్వయం చేస్తూ పనిచేస్తున్నామని అన్నారు.ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత. చిత్తూరు అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమే. నా ప్రతి అడుగు ప్రజల సంక్షేమం కోసమే ఉంటుంది" అని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు.చిత్తూరును అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రజల సహకారంతో ఆ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తాననే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే ప్రజాప్రతినిధిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన జీవిత పరమావధి అని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు.

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి