Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆడికృత్తిక మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

    Author RAJANEETHI | 05 Aug 2026, 08:38 PM | ANDHRA PRADESH
    ఆడికృత్తిక మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

    చౌడేపల్లి, ఆగస్టు 5 (రాజనీతి): పెద్దపంజాణి మండలం కొత్తవీరపల్లి గ్రామంలోని యోగ నందీశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ బాలసుబ్రహ్మణ్యస్వామి వారి ఆడికృత్తిక మహోత్సవాన్ని ఆగస్టు 7న వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, విశేష పూజలు, కావిళ్ల సమర్పణ కార్యక్రమాలు మంగళవాయిద్యాల నడుమ జరుగనున్నాయి. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానంతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

    అత్యధికంగా చదివినవి