Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తల్లిపాలే శిశువుకు తొలి టీకా.. ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది

    తల్లిపాలే శిశువుకు తొలి టీకా.. ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది

    పత్రిక ప్రకటన 💐 తేదీ. 05-08-2026--*-*ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల. తిరుపతి.** **తల్లిపాల వారోత్సవాలు --ఆగష్టు 1వ తేదీ మొదలు 8 వ తేదీ వరకు** ***** వారోత్సవాలు లో భాగంగా ఈరోజు ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో మెడికల్ సూపరింటెండెంట్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. *డా. కత్తి కావ్య, రీసెర్చెర్ (తల్లి పాలు పై అధ్యయనం )మాట్లాడుతూ* తల్లి ఒడిలో మొదలయ్యే జీవితానికి... తల్లిపాలే తొలి వరం

    *ఒక బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి తన తల్లినే వెతుకుతుంది. పుట్టిన వెంటనే తల్లి గుండె చప్పుడు, తల్లి స్పర్శ, తల్లి వాసన... ఇవన్నీ గర్భంలో తొమ్మిది నెలలు తనకు పరిచయమైనవే. అందుకే బిడ్డను పుట్టిన వెంటనే తల్లి ఛాతీపై ఉంచడం (Skin-to-Skin Contact) చాలా ముఖ్యమైనది. ఇది బిడ్డ శరీర ఉష్ణోగ్రతను, గుండె కొట్టుకునే వేగాన్ని, శ్వాసను స్థిరంగా ఉంచడమే కాకుండా, తల్లి–బిడ్డ మధ్య జీవితాంతం నిలిచే అనుబంధానికి తొలి అడుగు వేస్తుంది.**

    *పుట్టిన మొదటి గంటను "గోల్డెన్ అవర్ (Golden Hour)" అంటారు. ఈ సమయంలోనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం అత్యంత ముఖ్యమైనది. ఈ ఒక గంట ఆలస్యం కాకుండా పాలు ప్రారంభిస్తే బిడ్డకు ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. తల్లిలో కూడా పాల ఉత్పత్తి త్వరగా ప్రారంభమవుతుంది.**

    **చాలామందికి తెలియని ఒక అద్భుతం ఏమిటంటే...
    తల్లి రొమ్ము చుట్టూ ఉన్న చిన్న చిన్న మాంట్‌గొమెరి గ్రంథులు (Montgomery Glands) విడుదల చేసే సహజ వాసన, గర్భంలో బిడ్డ చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ద్రవం (ఉమ్మనీరు) వాసనను పోలి ఉంటుంది. అందుకే పుట్టిన కొద్ది సేపటికే చాలా మంది శిశువులు తల్లి రొమ్మును వెతికి పట్టుకోగలుగుతారు. ప్రకృతి బిడ్డ కోసం ముందుగానే ఈ అద్భుత ఏర్పాటును చేసింది**

    *మొదట వచ్చే పసుపు రంగు పాలు – కొలస్ట్రం (Colostrum) . కొందరు దీన్ని పారబోస్తారు. కానీ అదే బిడ్డకు తొలి సహజ టీకా. ఇందులో ఉండే యాంటీబాడీలు, రోగనిరోధక కణాలు బిడ్డకు రక్షణగా నిలుస్తాయి. పుట్టిన వెంటనే బిడ్డ పేగులు పూర్తిగా పరిపక్వంగా ఉండవు. కొలస్ట్రం వాటి లోపలి భాగంపై ఒక రక్షణ పొర ఏర్పడటానికి సహాయపడి, హానికరమైన సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించే అవకాశాన్ని తగ్గిస్తుంది.

    "మొదటి రోజు ఇంత తక్కువ పాలు ఎందుకు వస్తున్నాయి?" అని చాలా మంది తల్లులు ఆందోళన చెందుతారు. కానీ ప్రకృతి దానికి కూడా సమాధానం చెప్పింది. నవజాత శిశువు కడుపు మొదటి రోజు ఒక చిన్న చెర్రీ పండు పరిమాణంలో మాత్రమే ఉంటుంది. అందుకే కొద్దిగా వచ్చే కొలస్ట్రమే ఆ బిడ్డకు సరిపోతుంది. రెండో, మూడో రోజులకు కడుపు పరిమాణం పెరిగే కొద్దీ పాల ఉత్పత్తి కూడా సహజంగా పెరుగుతుంది.

    ఇంకో గొప్ప నిజం ఏమిటంటే... పాలు రొమ్ము చెప్పినట్లు రావు, మెదడు చెప్పినట్లు వస్తాయి. బిడ్డ రొమ్ము పీల్చినప్పుడు ఆ సంకేతం నరాల ద్వారా తల్లి మెదడుకు చేరుతుంది. అప్పుడు ప్రోలాక్టిన్ (Prolactin) అనే హార్మోన్ పాలను తయారు చేస్తుంది. *ఆక్సిటోసిన్ (Oxytocin)* అనే హార్మోన్ పాలను బయటకు వచ్చేలా చేస్తుంది. అందుకే ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి – *బిడ్డ ఎంత ఎక్కువగా పాలు తాగితే, తల్లి శరీరం అంత ఎక్కువగా పాలు తయారు చేస్తుంది.* తల్లిపాలు "వాడితే పెరిగే సంపద".

    తల్లిపాలు కూడా ఒకేలా ఉండవు. మొదట వచ్చే పాలు బిడ్డ దాహాన్ని తీర్చడానికి సహాయపడతాయి. చివర్లో వచ్చే పాలు కొవ్వు ఎక్కువగా ఉండి బిడ్డకు శక్తిని, బరువు పెరుగుదలను అందిస్తాయి. అందుకే ఒక రొమ్ము పూర్తిగా తాగిన తర్వాతే మరో రొమ్ము ఇవ్వడం మంచిది.

    ఇవి కూడా చదవండి

    కొంతమంది తల్లులు "బిడ్డ ఏడుస్తోంది... అంటే నా పాలు సరిపోవడం లేదేమో" అని భావిస్తారు. కానీ ప్రతి ఏడుపు ఆకలి వల్లే కాదు. బిడ్డకు తల్లి ఒడిలో ఉండాలని, నిద్ర కావాలని లేదా డైపర్ తడిగా ఉందని కూడా ఏడవవచ్చు. సరైన ల్యాచ్‌తో తరచుగా పాలు ఇస్తే చాలామందిలో పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.

    పాలు ఎక్కువసేపు రొమ్ములోనే నిలిచిపోతే రొమ్ములు బిగుసుకుపోవడం (*Breast Engorgement*) జరుగుతుంది. ఈ సమయంలో నొప్పి, వాపు, గట్టిపడటం కనిపించవచ్చు. పాలు నిలిచిపోవడం కొనసాగితే పాలనాళాలు మూసుకుపోయి, మాస్టిటిస్ (Mastitis) అనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బిడ్డ అడిగినప్పుడల్లా పాలు ఇవ్వడం, సరైన ల్యాచ్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అని తల్లులకు, వారి కుటుంబ సభ్యులకు తెలియ చేశారు.

    *డా. అనంత నిర్మలమ్మ, లెక్చరర్ ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ *వారు మాట్లాడుతూ* *తల్లిపాలు బిడ్డకే కాదు, తల్లికి కూడా ఒక వరం. బిడ్డ పాలు తాగినప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ గర్భాశయాన్ని కుదించడంలో సహాయపడుతుంది. దీనివల్ల ప్రసవానంతర రక్తస్రావం తగ్గుతుంది, గర్భాశయం త్వరగా సాధారణ పరిమాణానికి చేరుతుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల అదనపు క్యాలరీలు ఖర్చవుతాయి కాబట్టి ప్రసవానంతర బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. శాస్త్రీయ అధ్యయనాలు ఎక్కువకాలం తల్లిపాలు ఇచ్చిన మహిళల్లో *రొమ్ము క్యాన్సర్*, *అండాశయ క్యాన్సర్*, అలాగే టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు ద్వారా తెలిపాయని తెలియ చేశారు. మరియు శిశువుకు

    మొదటి *ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే* ఇవ్వాలి. నీరు కూడా అవసరం లేదు. తల్లిపాలలోనే బిడ్డకు కావాల్సిన నీరు, పోషకాలు, రోగనిరోధక శక్తి అన్నీ ఉంటాయి. ఆరు నెలల తర్వాత ఇంటి ఆహారం ప్రారంభించినా, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం మంచిది.

    కొన్ని తల్లులకు పాలు బిడ్డ అవసరానికి మించి ఉత్పత్తి అవుతాయి. అలాంటి తల్లులు, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటే, మానవ పాల బ్యాంక్ (Human Milk Bank) ద్వారా తమ పాలను దానం చేయవచ్చు. ఒక తల్లి పాలు మరో అకాల శిశువుకు ప్రాణదానం చేసే అవకాశం ఉంది.

    అయితే కొన్ని పరిస్థితుల్లో తప్పకుండా వైద్యుడిని లేదా లాక్టేషన్ కన్సల్టెంట్‌ను సంప్రదించాలి. బిడ్డ పాలు సరిగా తాగకపోతే, బరువు పెరగకపోతే, మూత్రం తక్కువగా వస్తే, తల్లికి తీవ్రమైన రొమ్ము నొప్పి, జ్వరం, ఎర్రబారడం, నిపుల్ పగుళ్లు ఉంటే ఆలస్యం చేయకూడదు.

    ఒక తల్లి విజయవంతంగా తల్లిపాలు ఇవ్వడం ఆమె ఒక్కరి బాధ్యత కాదు. భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు, కుటుంబ సభ్యులు ఆమెకు విశ్రాంతి, మంచి ఆహారం, ధైర్యం, ప్రేమ ఇవ్వాలి. తల్లికి మద్దతు ఉన్నప్పుడు తల్లిపాలు కూడా విజయవంతంగా కొనసాగుతాయి.

    గుర్తుంచుకోండి... తల్లిపాలు కేవలం ఆహారం కాదు. అవి ప్రకృతి ఇచ్చిన మొదటి ఔషధం, తొలి టీకా, ప్రేమకు ప్రతిరూపం. ప్రతి చుక్క తల్లిపాలు ఒక ఆరోగ్యకరమైన జీవితానికి బలమైన పునాది.
    ,*ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్ శ్రీమతి జయకుమారి, స్టాప్ నర్స్ శ్రీమతి పుష్ప, అనిత,కౌన్సిలర్ బేబీ కుమారి, నర్సింగ్ స్టూడెంట్స్, సెక్యూరిటీ సిబ్బంది,తల్లులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.**

    అత్యధికంగా చదివినవి