తల్లిపాలే శిశువుకు తొలి టీకా.. ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది

పత్రిక ప్రకటన 💐 తేదీ. 05-08-2026--*-*ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల. తిరుపతి.** **తల్లిపాల వారోత్సవాలు --ఆగష్టు 1వ తేదీ మొదలు 8 వ తేదీ వరకు** ***** వారోత్సవాలు లో భాగంగా ఈరోజు ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో మెడికల్ సూపరింటెండెంట్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. *డా. కత్తి కావ్య, రీసెర్చెర్ (తల్లి పాలు పై అధ్యయనం )మాట్లాడుతూ* తల్లి ఒడిలో మొదలయ్యే జీవితానికి... తల్లిపాలే తొలి వరం *ఒక బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి తన తల్లినే వెతుకుతుంది. పుట్టిన వెంటనే తల్లి గుండె చప్పుడు, తల్లి స్పర్శ, తల్లి వాసన... ఇవన్నీ గర్భంలో తొమ్మిది నెలలు తనకు పరిచయమైనవే....