Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎల్ నినో ప్రభావంతో ఎండిపోతున్న పంటలు: చౌడేపల్లి లో శాస్త్రవేత్తల పర్యటన

    ఎల్ నినో ప్రభావంతో ఎండిపోతున్న పంటలు: చౌడేపల్లి లో శాస్త్రవేత్తల పర్యటన

    ​చౌడేపల్లి ఆగస్టు 4 రాజనీతి
    చౌడేపల్లి మండలంలోని కొండామరి, వెంగళపల్లి, దిగువపల్లి గ్రామాలలో మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం విస్తృతంగా పర్యటించింది. కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కే. మంజుల ఆధ్వర్యంలో పెరమాళ్ళపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం, కేవీకే కలికిరి అగ్రి పాలిటెక్నిక్ శాస్త్రవేత్తలు ఎల్ నినో ప్రభావం వల్ల దెబ్బతింటున్న వివిధ పంటలను నేరుగా పరిశీలించారు. వర్షాలు లేకపోవడంతో వేరుశనగ పంట ఎదుగుదల లేక ఎక్కడికక్కడ ఎండిపోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర పంటలుగా వేసిన అలసంద, అనుమలు వాడిపోయి పొలాలు బీడు భూములుగా మారుతున్నాయని గుర్తించారు. అలాగే బోరు బావుల్లో నీటిమట్టం పడిపోవడంతో పాడి ఆవుల కోసం పెంచుతున్న సూపర్‌ నేపియర్, జొన్న వంటి పశుగ్రాస పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు కురిసినప్పుడు కంది, అలసంద, అనుమలు, ఉలవ, పెసర, మినుము, కొర్ర, జొన్న, సజ్జ, ఆముదం వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే కూరగాయలు, పండ్లతోటలు, పూలతోటల్లో నీటి ఆవిరిని తగ్గించడానికి పంట వ్యర్థాలు, ఎండుటాకులు, చిన్న కొమ్మలను ఆచ్ఛాదనగా (మల్చింగ్) వేసుకోవాలన్నారు. దీనివల్ల నేలలో తేమ నిలవడమే కాకుండా, ఈ వ్యర్థాలు కుళ్ళి ఎరువుగా ఉపయోగపడతాయని తెలిపారు. వీలున్న రైతులు పొలాల వద్ద వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి గుంతలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
    ​ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ పొందేందుకు రైతులందరూ తప్పనిసరిగా పంట భీమా చేయించుకోవాలని స్పష్టం చేశారు.
    ​ఈ పొలాల సందర్శన కార్యక్రమంలో పెరుమాళ్ళపల్లి రీసెర్చ్ స్టేషన్ హెడ్ డాక్టర్ ఎం. రెడ్డి కుమార్, సైంటిస్ట్ డాక్టర్ కె.ఆర్. ఠాగోర్, మండల వ్యవసాయ అధికారి మోహన్, సబ్జెక్టు మేటర్ స్పెషలిస్ట్ ఎస్. సోమశేఖర బాబు, అగ్రి ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ అధ్యాపకురాలు జ్యోత్స్న, పాలిటెక్నిక్ విద్యార్థినులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి