ఎల్ నినో ప్రభావంతో ఎండిపోతున్న పంటలు: చౌడేపల్లి లో శాస్త్రవేత్తల పర్యటన
చౌడేపల్లి ఆగస్టు 4 రాజనీతి చౌడేపల్లి మండలంలోని కొండామరి, వెంగళపల్లి, దిగువపల్లి గ్రామాలలో మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం విస్తృతంగా పర్యటించింది. కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కే. మంజుల ఆధ్వర్యంలో పెరమాళ్ళపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం, కేవీకే కలికిరి అగ్రి పాలిటెక్నిక్ శాస్త్రవేత్తలు ఎల్ నినో ప్రభావం వల్ల దెబ్బతింటున్న వివిధ పంటలను నేరుగా పరిశీలించారు. వర్షాలు లేకపోవడంతో వేరుశనగ పంట ఎదుగుదల లేక ఎక్కడికక్కడ ఎండిపోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర పంటలుగా వేసిన అలసంద, అనుమలు వాడిపోయి పొలాలు బీడు భూములుగా మారుతున్నాయని గుర్తించారు. అలాగే బోరు బావుల్లో నీటిమట్టం పడిపోవడంతో పాడి ఆవుల...