Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆరోగ్యవరంలో అట్టహాసంగా ప్రారంభమైన ఆడమ్ మెమోరియల్ సౌత్ ఇండియా ఫుట్‌బాల్ టోర్నమెంట్

    ఆరోగ్యవరంలో అట్టహాసంగా ప్రారంభమైన ఆడమ్ మెమోరియల్ సౌత్ ఇండియా ఫుట్‌బాల్ టోర్నమెంట్

    ఆరోగ్యవరం,రాజనీతి ఆగస్టు 4, 2026:

    ఆరోగ్యవరం ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ప్రతిష్టాత్మకమైన ఆడమ్ మెమోరియల్ సౌత్ ఇండియా ఫుట్‌బాల్ టోర్నమెంట్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దక్షిణ భారత రాష్ట్రాల నుంచి విచ్చేసిన జట్లు, క్రీడాభిమానులు, మాజీ క్రీడాకారులు, స్థానిక ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
    ఈ టోర్నమెంట్ స్థానిక సంఘ పాస్టర్ రేవ. ఎ. అబ్రహాం వారి ప్రార్థనలతో ప్రారంభమైంది. అనంతరం రేవ. డా. ఎం. ఏ. నెల్సన్ (జమ్మలమడుగు), రేవ. నోయల్ విజయ్ భూషణ్ (బురకాయలకోట) ఆశీర్వచనాలు అందించి, టోర్నమెంట్ ను విజయవంతంగా ప్రారంభించారు.
    ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సి ఎస్ ఐ రాయలసీమ డయాసిస్ అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ డి. సి. అన్నీస్ మోసెస్ (నేషీ), స్థానిక ఫుట్‌బాల్ క్రీడాకారులు మరియు స్వచ్ఛంద సేవకులు విశేష కృషి చేశారు. వారి సమిష్టి సహకారంతో ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత విజయవంతంగా జరిగింది.

    ఆరోగ్యవరంలో అట్టహాసంగా ప్రారంభమైన ఆడమ్ మెమోరియల్ సౌత్ ఇండియా ఫుట్‌బాల్ టోర్నమెంట్ - Additional Image

    ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను దివంగత శ్రీ ఆడమ్ గారి కుటుంబ సభ్యుల ద్వారా ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతున్నది, గ్రామీణ యువతలో ఫుట్‌బాల్ క్రీడను ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులకు వేదిక కల్పించడం ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    ప్రారంభ కార్యక్రమం అనంతరం తొలి మ్యాచ్ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. ప్రేక్షకుల కేరింతలు, ఆటగాళ్ల అద్భుత ప్రతిభతో ఆరోగ్యవరం ఫుట్‌బాల్ మైదానం క్రీడా సంబరాలతో కళకళలాడింది.
    రాబోయే రోజుల్లో జరిగే పోటీలు మరింత ఉత్కంఠభరితంగా సాగనున్నాయని, ఈ టోర్నమెంట్ దక్షిణ భారత ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధికి విశేషంగా దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. :::

    అత్యధికంగా చదివినవి