ఆరోగ్యవరంలో అట్టహాసంగా ప్రారంభమైన ఆడమ్ మెమోరియల్ సౌత్ ఇండియా ఫుట్‌బాల్ టోర్నమెంట్
ఆరోగ్యవరం,రాజనీతి ఆగస్టు 4, 2026: ఆరోగ్యవరం ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ప్రతిష్టాత్మకమైన ఆడమ్ మెమోరియల్ సౌత్ ఇండియా ఫుట్‌బాల్ టోర్నమెంట్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దక్షిణ భారత రాష్ట్రాల నుంచి విచ్చేసిన జట్లు, క్రీడాభిమానులు, మాజీ క్రీడాకారులు, స్థానిక ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ టోర్నమెంట్ స్థానిక సంఘ పాస్టర్ రేవ. ఎ. అబ్రహాం వారి ప్రార్థనలతో ప్రారంభమైంది. అనంతరం రేవ. డా. ఎం. ఏ. నెల్సన్ (జమ్మలమడుగు), రేవ. నోయల్ విజయ్ భూషణ్ (బురకాయలకోట) ఆశీర్వచనాలు అందించి, టోర్నమెంట్ ను విజయవంతంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సి ఎస్ ఐ రాయలసీమ డయాసిస్ అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ డి....