Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పీజీఆర్ఎస్'లో ప్రజల గోడు విన్న కమిషనర్ నరసింహ ప్రసాద్...

    పీజీఆర్ఎస్'లో ప్రజల గోడు విన్న కమిషనర్ నరసింహ ప్రసాద్...

    చిత్తూరు,(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో పాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)" కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. సమస్యలు వివరించిన ప్రతి ఒక్కరి వినతిని ఓపికగా ఆలకించిన ఆయన, వాటి స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖ అధికారులతో అక్కడికక్కడే సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేసిన కమిషనర్, ప్రతి వినతిపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులో చర్యలు పూర్తి చేయాలని సూచించారు.సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 7 వినతులు అందాయి. తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు, పన్నులు తదితర పౌర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతి వినతిని నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించడంతో పాటు పరిష్కార చర్యలను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు.
    ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు పీజీఆర్ఎస్ వేదిక సమర్థవంతంగా పనిచేస్తోందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా వేగంగా పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, ఏసీపీ నాగేంద్రతో పాటు నగరపాలక సంస్థకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.