పీజీఆర్ఎస్'లో ప్రజల గోడు విన్న కమిషనర్ నరసింహ ప్రసాద్...

చిత్తూరు,(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో పాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)" కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. సమస్యలు వివరించిన ప్రతి ఒక్కరి వినతిని ఓపికగా ఆలకించిన ఆయన, వాటి స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖ అధికారులతో అక్కడికక్కడే సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేసిన కమిషనర్, ప్రతి వినతిపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కారం చూపాలని...