Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైతు బజార్‌కు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అండ.. 30 దుకాణాల అద్దె భారం భుజాన!

    Author GNANAPRAKASH | 03 Aug 2026, 07:39 PM | ANDHRA PRADESH, Politics, చిత్తూరు
    రైతు బజార్‌కు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అండ.. 30 దుకాణాల అద్దె భారం భుజాన!

    చిత్తూరు,(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):రైతులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రైతు బజార్లలోనే రైతులు పండించిన తాజా కూరగాయలను కొనుగోలు చేసి వారికి అండగా నిలవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరులోని మిట్టూరు రైతు బజారును ఆయన సందర్శించి రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. పలువురు రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేసి మహిళా రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా రైతులు తమ గోడును ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల రైతు బజార్‌కు కొనుగోలుదారులు తగ్గిపోయారని, రహదారుల వెంట ఏర్పడిన కూరగాయల దుకాణాలు, హోమ్ డెలివరీ విధానం కారణంగా వ్యాపారం మందగించిందని వాపోయారు. దీంతో తమకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.రైతుల సమస్యలను విన్న ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. రైతు బజార్‌లో దుకాణాలు నిర్వహిస్తున్న అందరికీ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రైతు బజార్‌లోని మొత్తం 30 దుకాణాల అద్దెను ప్రతి నెలా జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా చెల్లిస్తానని సంబంధిత ఎస్టేట్ అధికారికి తెలిపారు. రైతులపై అదనపు భారం పడకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.అంతేకాకుండా రైతు బజార్‌లో వ్యాపారం పెరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమం తప్పకుండా రైతు బజార్‌లో కూరగాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల్లో రైతు బజార్లపై మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు. దీంతో అక్కడున్న మహిళా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు తాము పండించిన పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో రైతు బజార్లను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కాలంటే ప్రజలు రైతు బజార్లలోనే కొనుగోళ్లు చేయాలని, తద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని అన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి