రైతు బజార్‌కు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అండ.. 30 దుకాణాల అద్దె భారం భుజాన!
చిత్తూరు,(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):రైతులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రైతు బజార్లలోనే రైతులు పండించిన తాజా కూరగాయలను కొనుగోలు చేసి వారికి అండగా నిలవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరులోని మిట్టూరు రైతు బజారును ఆయన సందర్శించి రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. పలువురు రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేసి మహిళా రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా రైతులు తమ గోడును ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల రైతు బజార్‌కు కొనుగోలుదారులు తగ్గిపోయారని, రహదారుల వెంట ఏర్పడిన కూరగాయల దుకాణాలు, హోమ్ డెలివరీ విధానం కారణంగా వ్యాపారం మందగించిందని వాపోయారు. దీంతో తమకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.రైతుల...