Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రేమ వివాహం చేసుకున్న దంపతులకు ప్రాణహాని.. రక్షణ కల్పించాలని వేడుకోలు...

    Author RAJANEETHI | 03 Aug 2026, 12:26 AM | ANDHRA PRADESH, Crime, చిత్తూరు
    ప్రేమ వివాహం చేసుకున్న దంపతులకు ప్రాణహాని.. రక్షణ కల్పించాలని వేడుకోలు...

    చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో బిందుప్రియ ఆవేదన – జిల్లా కలెక్టర్, ఎస్పీకి విజ్ఞప్తి...

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ప్రేమించి వివాహం చేసుకున్న తమకు, ఇటీవల జన్మించిన చంటి బిడ్డకు సైతం ప్రాణహాని ఉందని తవణంపల్లి మండలం ఎగువమారేడుపల్లి గ్రామానికి చెందిన బిందుప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.తన గ్రామానికే చెందిన భరత్‌ను ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నామని తెలిపారు. అప్పటి నుంచి తన భర్త, అత్తమామలపై తన తల్లిదండ్రులు, సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో తన భర్తను కిడ్నాప్ చేసిన ఘటనపై బెంగళూరులో కేసు నమోదైందని చెప్పారు.తమకు ఇటీవల చంటి బిడ్డ పుట్టినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, నిత్యం బెదిరింపులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. గ్రామ బహిష్కరణకు గురిచేశారని, పోలీసులను ఆశ్రయించినప్పటికీ తగిన రక్షణ లభించలేదని తెలిపారు.తమ కుటుంబానికి ఎలాంటి అపాయం జరగకుండా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి పోలీసు రక్షణ కల్పించాలని బిందుప్రియ విజ్ఞప్తి చేశారు.

    అత్యధికంగా చదివినవి