ప్రేమ వివాహం చేసుకున్న దంపతులకు ప్రాణహాని.. రక్షణ కల్పించాలని వేడుకోలు...

చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో బిందుప్రియ ఆవేదన – జిల్లా కలెక్టర్, ఎస్పీకి విజ్ఞప్తి... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ప్రేమించి వివాహం చేసుకున్న తమకు, ఇటీవల జన్మించిన చంటి బిడ్డకు సైతం ప్రాణహాని ఉందని తవణంపల్లి మండలం ఎగువమారేడుపల్లి గ్రామానికి చెందిన బిందుప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.తన గ్రామానికే చెందిన భరత్‌ను ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నామని తెలిపారు. అప్పటి నుంచి తన భర్త, అత్తమామలపై తన తల్లిదండ్రులు, సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో తన భర్తను కిడ్నాప్ చేసిన ఘటనపై బెంగళూరులో కేసు నమోదైందని...