Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పంటల భీమా నమోదు గడువు పెంచాలి : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అగ్గిదేవర వెంకటరమణ

    పంటల భీమా నమోదు గడువు పెంచాలి  : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అగ్గిదేవర వెంకటరమణ

    చౌడేపల్లి ఆగస్టు 1 రాజనీతి న్యూస్ :
    పంటల భీమా నమోదు గడువును పెంచాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అగ్గిదేవర వెంకటరమణ ప్రభుత్వాన్ని కోరారు శనివారం స్థానిక వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్–2026 సీజన్‌కు సంబంధించి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం నమోదు ప్రక్రియను జూలై 31 వరకు ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయితుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారని దీనివల్ల రైతులు పంట నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున భీమా సదుపాయాన్ని మరింతగా గడువు పెంచాలని ఆయన అన్నారు అంతేకాకుండా సంబంధిత సర్వర్లు పనిచేయకుండా పోవడంతో ఆలస్యం అవుతుందని రైతుల కోసం ప్రభుత్వం గడువు పెంచాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ విజయ్ వైకాపా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షంషేర్ బోయకొండ మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు శెట్టిపేట శంకరప్ప వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

    అత్యధికంగా చదివినవి