Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరసన

    Author RAJANEETHI | 31 Jul 2026, 12:41 PM | ANDHRA PRADESH
    జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరసన

    పీలేరు, జూలై 31 (రాజనీతి): ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ పీలేరులో జర్నలిస్టులు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు జాకీర్ పఠాన్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ఆర్డీవో విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటి స్థలం, అటాక్స్ కమిటీ, స్వయంప్రతిపత్తి కలిగిన మీడియా కమిషన్, ప్రెస్ అకాడమీ గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి