Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తల్లిపాల వారోత్చవాలను విజయవంతం చేద్దాం. డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ లక్ష్మీ నరసయ్య, డి. ఐ. ఓ డాక్టర్ ఉషశ్రీ

    తల్లిపాల వారోత్చవాలను  విజయవంతం చేద్దాం. డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ లక్ష్మీ నరసయ్య, డి. ఐ. ఓ డాక్టర్ ఉషశ్రీ

    మదనపల్లి 30/7/25
    ప్రపంచ తల్లిపాల వారోత్చవాలను విజయవంతం చేద్దాం అని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య మరియు డి. ఐ. ఓ. డాక్టర్ ఉషశ్రీ సంయుక్తంగా ఒక ప్రకటన లో తెలిపారు.గురువారం జిల్లా కేంద్రం లోని డి. ఎమ్. హెచ్. ఓ. కార్యాలయం లోని ఆయన ఛాంబర్ లో ప్రపంచ తల్లిపాల వారోత్చావాల బ్యానర్ మరియు కరదీపికలను ఆవిష్కరణ చేశారు.ఆగష్టు నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు విశ్వ వ్యాప్తంగా ఈ ఉత్చావాలను వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు కలసి నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుచు తల్లిపాలకు ప్రత్యన్యాయం వేరే ఏమి లేదని, తల్లి పాలు స్వచ్ఛమైనవి, కల్తీ లేనివి, ఖర్చు లేనివి, శిశువుకు దేవుడు ఇచ్చిన వరమని, బలవర్తకమైన ఆహరం శిశువుకు తల్లి పాలు మొదటి ఆరు నెలలు తప్పక ఇవ్వాలని అన్నారు. పుట్టిన అరగంట లోపే తల్లిపాలు శిశువుకు ఇవ్వడం ప్రారంభించాలని అన్నారు. తల్లిపాలవలన శిశువుకు వ్యాధినిరోధక శక్తి పెరిగి అంటువ్యాధులకు గురికాకుండా ఆరోగ్యాంగా ఉంటారని అదే సమయం లో తల్లికి, బిడ్డకు మధ్య బంధం మరింత బలపడుతుంది అన్నారు. తల్లిలో గర్భశయం యాదస్తానానికి రావడానికి సాధ్యమవుతుంది. తల్లి లో రక్తశ్రావం నిలిచిపోవడానికి సహాయపడుతుంది. వెంటనే తల్లి మళ్ళీ గర్భం ధరించకుండా శిశువు కు తల్లిపాలు ఇవ్వడం వల్ల సాధ్యం అవుతుంది.శిశువుకు తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ రాదు.ఈ తల్లిపాల వారోత్చవాలలో ప్రతీ అంగన్వాడీ కేంద్రం లో, ఆరోగ్య కేంద్రాలలో తల్లులకు, గర్భవతులకు, బాలింతలకు తల్లిపాల వల్ల కలుగు లాభల గురించి అవగాహన కల్పిస్తారణి కావున ప్రజలు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాళన్నారు. చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో డి. ఎమ్. హెచ్. ఓ. డా లక్ష్మీనరసయ్య, డి. ఐ. ఓ. డాక్టర్ ఉషశ్రీ, స్త్రీల వైద్యుల నిపుణులు డాక్టర్ అనురాధ, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ ఆరీఫుల్ల, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.
    💐రండి, మనమందరం కలసి ప్రతీ బిడ్డకు తల్లిపాలు అందాలనే ప్రతిజ్ఞ చేసి తల్లులు కాబోతున్న వారికి సహకరిద్దాం. ప్రతీ బిడ్డకూ తల్లిపాలు అందేలా చేయడమే మన సంకల్పం. 💐
    వందనములతో
    జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ
    మదనపల్లి
    అన్నమయ్య జిల్లా

    అత్యధికంగా చదివినవి