తల్లిపాల వారోత్చవాలను విజయవంతం చేద్దాం. డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ లక్ష్మీ నరసయ్య, డి. ఐ. ఓ డాక్టర్ ఉషశ్రీ
మదనపల్లి 30/7/25 ప్రపంచ తల్లిపాల వారోత్చవాలను విజయవంతం చేద్దాం అని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య మరియు డి. ఐ. ఓ. డాక్టర్ ఉషశ్రీ సంయుక్తంగా ఒక ప్రకటన లో తెలిపారు.గురువారం జిల్లా కేంద్రం లోని డి. ఎమ్. హెచ్. ఓ. కార్యాలయం లోని ఆయన ఛాంబర్ లో ప్రపంచ తల్లిపాల వారోత్చావాల బ్యానర్ మరియు కరదీపికలను ఆవిష్కరణ చేశారు.ఆగష్టు నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు విశ్వ వ్యాప్తంగా ఈ ఉత్చావాలను వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు కలసి నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుచు తల్లిపాలకు ప్రత్యన్యాయం...