Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 'సూపర్ ఎల్‌నినో' ముప్పు.. ఇప్పుడే అప్రమత్తం కాకపోతే రైతులకు భారీ నష్టం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

    'సూపర్ ఎల్‌నినో' ముప్పు.. ఇప్పుడే అప్రమత్తం కాకపోతే రైతులకు భారీ నష్టం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

    రైతుల్లో అవగాహన కల్పించాలన్న ఉప ముఖ్యమంత్రి.. నీటి పొదుపు, ప్రత్యామ్నాయ పంటలు, పీఎం ఫసల్ బీమాపై ప్రత్యేక దృష్టి
    రాజనీతి | 30 జూలై 2026

    రాష్ట్రంలో నెలకొనే అవకాశమున్న సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులను ముందుగానే అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమావేశమైన ఆయన, సాగునీటి సంక్షోభంపై రైతులకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

    రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులను వివరించడంతో పాటు, తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పెంచాలని పవన్ సూచించారు. అలాగే ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజనలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ నష్టాలను తగ్గించే దిశగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    ఏలేరు ప్రాజెక్టు నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మల రామానాయుడికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నీటి విడుదలతో పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతాల రైతులకు ఊరట లభించిందని పేర్కొన్నారు.

    ప్రస్తుతం ప్రతి నీటి బొట్టు విలువైనదేనని, నీటి వృథాను అరికట్టడం, కాలువల్లో పూడిక తొలగించడం, లీకేజీల నివారణ వంటి చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

    అత్యధికంగా చదివినవి