'సూపర్ ఎల్‌నినో' ముప్పు.. ఇప్పుడే అప్రమత్తం కాకపోతే రైతులకు భారీ నష్టం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రైతుల్లో అవగాహన కల్పించాలన్న ఉప ముఖ్యమంత్రి.. నీటి పొదుపు, ప్రత్యామ్నాయ పంటలు, పీఎం ఫసల్ బీమాపై ప్రత్యేక దృష్టి రాజనీతి | 30 జూలై 2026 రాష్ట్రంలో నెలకొనే అవకాశమున్న సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులను ముందుగానే అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమావేశమైన ఆయన, సాగునీటి సంక్షోభంపై రైతులకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులను వివరించడంతో పాటు, తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పెంచాలని పవన్ సూచించారు. అలాగే ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజనలో నమోదు...