Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైతులు – విద్యార్థులు ఒక్క వేదికపైకి?.. ఢిల్లీలో రాకేశ్ టికాయత్‌తో సీజేపీ కీలక భేటీ!

    రైతులు – విద్యార్థులు ఒక్క వేదికపైకి?.. ఢిల్లీలో రాకేశ్ టికాయత్‌తో సీజేపీ కీలక భేటీ!

    ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి వ్యూహరచన – విద్యార్థులు, రైతులు, యువతతో సంయుక్త వేదిక ఏర్పాటు దిశగా చర్చలు


    విద్యార్థుల ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసే దిశగా సీజేపీ (CJP) కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పార్టీ ప్రతినిధులు ఢిల్లీలో ప్రముఖ రైతు నాయకుడు రాకేశ్ టికాయత్‌తో సమావేశమై, రైతులు–విద్యార్థులు–యువత కలిసి ఉమ్మడి వేదికపై పోరాటం చేసే అవకాశాలపై చర్చించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విస్తృత ప్రజా ఉద్యమాన్ని నిర్మించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశంగా వెల్లడైంది.

    సమావేశంలో విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, యువత సమస్యలు, రైతుల డిమాండ్లను ఒకే వేదికపై ప్రస్తావించే అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రైతులు, విద్యార్థులు, యువత కలిసి దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై సమన్వయంతో ముందుకు వెళ్లాలని నేతలు అభిప్రాయపడ్డారు.

    ఇవి కూడా చదవండి

    రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించిన రాకేశ్ టికాయత్ కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరిగే ఉద్యమాలకు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే మరిన్ని చర్చలు నిర్వహించి, సంయుక్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇటీవల విద్యార్థుల ఆందోళనలతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన సీజేపీ, ఇప్పుడు రైతు సంఘాలతోనూ చేతులు కలిపే ప్రయత్నం చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీతో విద్యార్థుల ఉద్యమం మరింత విస్తృత ప్రజా ఉద్యమంగా మారుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

    అత్యధికంగా చదివినవి