రైతులు – విద్యార్థులు ఒక్క వేదికపైకి?.. ఢిల్లీలో రాకేశ్ టికాయత్‌తో సీజేపీ కీలక భేటీ!

ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి వ్యూహరచన – విద్యార్థులు, రైతులు, యువతతో సంయుక్త వేదిక ఏర్పాటు దిశగా చర్చలు విద్యార్థుల ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసే దిశగా సీజేపీ (CJP) కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పార్టీ ప్రతినిధులు ఢిల్లీలో ప్రముఖ రైతు నాయకుడు రాకేశ్ టికాయత్‌తో సమావేశమై, రైతులు–విద్యార్థులు–యువత కలిసి ఉమ్మడి వేదికపై పోరాటం చేసే అవకాశాలపై చర్చించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విస్తృత ప్రజా ఉద్యమాన్ని నిర్మించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశంగా వెల్లడైంది. సమావేశంలో విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, యువత సమస్యలు, రైతుల డిమాండ్లను ఒకే వేదికపై ప్రస్తావించే అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రైతులు,...