Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలోని లోపాలను సరిచేయాలి

    ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)  ప్రక్రియలోని లోపాలను సరిచేయాలి

    భాకరాపేట :
    ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలోని లోపాలను సరిచేయాలని చిన్నగొట్టిగల్లు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహాల మోహన కోరారు. బుధవారం మండల డిప్యూటీ తహశీల్దార్ కు ఎస్ఐ ఆర్ ను సమగ్రంగా పరిశీలించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
    దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘంపై ఉంది. ప్రస్తుతం మన మండలంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను మేము స్వాగతిస్తున్నాము. అయితే, క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ సజావుగా సాగడంలో ఓటర్లు, ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో బూత్ లెవెల్ అధికారులు (BLO) ఇళ్లకు రాకపోవడం, అందుబాటులో ఉండకపోవడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.ఫారాల భర్తీలో సమస్యలు: ఎన్యూమరెన్ ఫారాలను పూర్తిగా నింపడం, సాంకేతిక లోపాలు మరియు అవగాహన లేకపోవడం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం లేకపోవడం వల్ల అర్హులైన నిజమైన ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగించబడే అవకాశం ఉంది.క్షేత్రస్థాయి పరిశీలనలో కొన్ని చోట్ల ఏకపక్షంగా, రాజకీయ ప్రమేయంతో సర్వే జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కేలా చూడాలి.. పది పదిహేనేళ్ళ క్రితం పెళ్లయిన వారు, పల్లెలు నుంచి పట్టణాలకు వెళ్లి స్థీరపడినవారు, ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేకున్నా ఓటరు గా ఇక్కడే ఉండేవిధంగా ఎన్యుమరేషన్ చేయడాన్ని సమగ్రంగా పరిశీలించాలని అధికారులను కోరారు. దీని పై న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నామని చెప్పారు. ప్రత్యేక శ్రద్ధ వహించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

    అత్యధికంగా చదివినవి