ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలోని లోపాలను సరిచేయాలి

భాకరాపేట : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలోని లోపాలను సరిచేయాలని చిన్నగొట్టిగల్లు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహాల మోహన కోరారు. బుధవారం మండల డిప్యూటీ తహశీల్దార్ కు ఎస్ఐ ఆర్ ను సమగ్రంగా పరిశీలించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘంపై ఉంది. ప్రస్తుతం మన మండలంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను మేము స్వాగతిస్తున్నాము. అయితే, క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ సజావుగా సాగడంలో ఓటర్లు, ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు....